రష్యాలో ఎన్‌ఎండీసీ లిథియం వేట
ABN , Publish Date - Nov 11 , 2026 | 05:47 AM
ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజం, వజ్రాలతో పాటు అరుదైన కీలక లోహాల అన్వేషణ, ప్రాసెసింగ్‌కు సిద్ధమవుతోంది
రోసాటోమ్‌తో ప్రాథమిక చర్చలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజం, వజ్రాలతో పాటు అరుదైన కీలక లోహాల అన్వేషణ, ప్రాసెసింగ్‌కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రష్యా ప్రభుత్వ రంగ సంస్థ రోసాటోమ్‌తో కలిసి ఆ దేశంలో లిథియం ఖనిజ అన్వేషణ, ఉత్పత్తి చేపట్టాలని భావిస్తోంది. ఇటీవల ఒక అంతర్జాతీయ సదస్సు కోసం రష్యా వెళ్లిన ఎన్‌ఎండీసీ అధికారులు రోసాటోమ్ అధికారులతో చర్చలు జరిపినట్టు సమాచారం. అరుదైన కీలక లోహాల్లో ఒకటైన లిథియంను ఎలక్ట్రిక్ వాహనాల్లో కీలకమైన బ్యాటరీల తయారీకి ఉపయోగిస్తారు. ప్రస్తుతం మన దేశం ఈ లోహంతో చేసిన బ్యాటరీలను చైనా, వియత్నాం, ఈక్వెడార్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. చైనా ఇటీవల ఈ సరఫరాలపై ఆంక్షలు విధించడంతో దేశీయ విద్యుత్ వాహన పరిశ్రమ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. దీంతో చైనా ఆంక్షలకు చెక్ పెట్టేందుకు రష్యా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాల్లో కీలక అరుదైన ఖనిజాల ప్రాజెక్టుల్లో భాగస్వామి కావాలని ప్రభుత్వం దేశీయ కంపెనీలను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం రూ.2,814 కోట్లతో ప్రత్యేక ప్రోత్సాహకాల నిధిని కూడా ఏర్పాటు చేసింది.
ఇవి కూడా చదవండి..
బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!
దాడికి సిద్ధంగా ఉన్నాం.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడి వార్నింగ్..