Share News

ప్రతి విభేదానికి కోర్టుకెళ్లొద్దు

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:27 AM

వ్యాపారులు ప్రభుత్వం, నియంత్రణ మండళ్లతో నిర్మాణాత్మకంగా సంప్రదింపులు జరుపాలని.. ప్రతి విభేదానికి కోర్టుకు వెళ్లవద్దని కార్పొరేట్‌ వర్గాలను కేంద్ర ఆర్థిక మంత్రి..

ప్రతి విభేదానికి కోర్టుకెళ్లొద్దు

కార్పొరేట్‌ వర్గాలకు ఆర్థిక మంత్రి సీతారామన్‌ హితవు

న్యూఢిల్లీ: వ్యాపారులు ప్రభుత్వం, నియంత్రణ మండళ్లతో నిర్మాణాత్మకంగా సంప్రదింపులు జరుపాలని.. ప్రతి విభేదానికి కోర్టుకు వెళ్లవద్దని కార్పొరేట్‌ వర్గాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు. కంపెనీలు పాలన ప్రమాణాలను పటిష్ఠం చేయడంపై దృష్టిసారించాలని ఆమె హితవు పలికారు. కార్పొరేట్‌ పాలన ప్రమాణాలంటే కేవలం బాహ్య నియమావళి కాదని, కంపెనీలు తమ సొంత ప్రమాణాలను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. వ్యాపారాల మధ్య నమ్మకాన్ని డిమాండ్‌ చేయలేమని, దాన్ని ఇరుపక్షాలు కలిసి నిర్మించుకోవాలని ఏఐఎంఏ సదస్సులో మంగళవారం పాల్గొన్న సందర్భంగా మంత్రి అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

Updated Date - Sep 23 , 2026 | 04:34 AM