బడ్జెట్ 2026: మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2లక్షల కోట్లు
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:56 AM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని విస్తరించేందుకు పలు నగరాలను అనుసంధానిస్తూ హైస్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కొత్తగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్
కొత్తగా ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు
పుణె- హైదరాబాద్, హైదరాబాద్- బెంగళూరు కారిడార్లు
ఇంటర్నెట్ డెస్క్: ఇవాళ(ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది. ఇందులోవారణాసి, పట్నాలో షిప్ రిపేరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఐదేళ్లలో కొత్త 20 జలమార్గాల అభివృద్ధికి నిధులు ప్రకటించారు.
బెంగాల్-గుజరాత్ వరకు కొత్తగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను బడ్జెట్‌లో చేర్చారు. అలాగే.. కొత్తగా ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. వీటిలో హైదరాబాద్-పుణె, హైదరాబాద్-బెంగళూరు మధ్య కారిడార్లు ఉన్నాయి. హైదరాబాద్-చెన్నై, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి కారిడార్లు కూడా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. కొత్తగా హైటెక్ టూల్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. పరిశ్రమలు-విద్యాసంస్థలకు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. దేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి..
బడ్జెట్ 2026: నిర్మలమ్మ చేతిలో రెడ్ బ్యాగ్.. ప్రత్యేకతలివే..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..