మార్కెట్లలో మళ్లీ ఒత్తిడి..!
ABN , Publish Date - Sep 07 , 2026 | 03:29 AM
గత వారం నిఫ్టీ 23,897, బ్యాంక్ నిఫ్టీ 57,369 పాయింట్ల వద్ద ముగిసాయి. ఈ వారం మార్కెట్లు కీలక ట్రిగ్గర్లను ఎదుర్కొనే అవకాశం ఉంది.
గత వారం నిఫ్టీ 23,897, బ్యాంక్ నిఫ్టీ 57,369 పాయింట్ల వద్ద ముగిసాయి. ఈ వారం మార్కెట్లు కీలక ట్రిగ్గర్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. హోర్ముజ్ సంక్షోభంతో బ్రెంట్ క్రూడాయిల్ 92-95 డాలర్లకు ఎగబాకటం, యూఎస్ బాండ్ ఈల్డ్స్ 4.79 శాతానికి చేరటం, ఎఫ్‌ఐఐల నికర అమ్మకాలు మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతున్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి 23,780 కీలక మద్దతు స్థాయిగా ఉండగా ప్రధాన నిరోధ స్థాయి 24,030గా ఉంది. ఈ వారం క్రూడ్ ప్రభావంతో ఓఎంసీలు, ఆటో రంగాలు సానుకూలంగా ఉండకపోవచ్చు. అయితే డిఫెన్సివ్ సపోర్ట్‌తో మెటల్స్, ప్రైవేట్ బ్యాంకులు, ఫార్మా రంగాలు ముందజ వేసే అవకాశం ఉంది.
స్టాక్ రికమండేషన్స్
టాటా స్టీల్: జీవితకాల గరిష్ఠం తర్వాత ఈ షేరు దాదాపు 20 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. గత రెసిస్టెన్సీ వద్ద మరోసారి మద్దతు తీసుకున్నాయి. చివరి నాలుగు సెషన్లలో భారీ వాల్యూమ్ నమోదవటంతో అందరి ఫోకస్ పెరిగింది. గత శుక్రవారం రూ.188 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.185 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.210/215 టార్గెట్ ధరతో కొనవచ్చు. రూ.182 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
హ్యుండయ్ మోటార్స్: ఏప్రిల్ నుంచి ఆగస్టు చివరి వరకు 38 శాతం రాబడిని అందించిన ఈ షేరులో చిన్న పుల్‌బ్యాక్ నమోదైంది. ప్రస్తుతం అన్ని రకాల మూవింగ్ యావరేజెస్ వద్ద మద్దతు తీసుకోవటం గమనార్హం. రిలేటివ్ స్ట్రెంత్ మెరుగవుతోంది. గత శుక్రవారం రూ.2,205 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో రూ.2,180 పై స్థాయిలో ప్రవేశించి రూ.2,300 టార్గెట్ ధరతో కొనవచ్చు. రూ.2,150 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
కల్యాణ్ జువెలర్స్: జూలైలో ఏకంగా 86 శాతం పెరిగిన ఈ షేరులో ప్రస్తుతం కన్సాలిడేషన్ కొనసాగుతోంది. వాల్యూ మ్ తక్కువగా నమోదవుతోంది. ప్రైస్ యాక్షన్ కూడా టైట్‌గా ఉంది. డివిడెండ్ తేదీ సమీపిస్తుండటంతో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. గత శుక్రవారం రూ.598 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.580 ఎగువన ప్రవేశించి రూ.660 టార్గెట్ ధరతో కొనవచ్చు. రూ.550 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
ఎక్సైడ్ ఇండస్ట్రీస్: జూన్ త్రైమాసిక ఫలితాల తర్వాత ఈ కౌంటర్‌లో సప్లయ్ పెరిగింది. 200 రోజుల మూవింగ్ యావరేజెస్ వద్ద మద్దతు దొరికే అవకాశం లేకపోలేదు. వాల్యూమ్, రిలేటివ్ స్ట్రెంత్ మెరుగ్గా ఉన్నాయి. గత శుక్రవారం రూ.424 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.425 వద్ద పొజిషన్ తీసుకుని రూ.490 టార్గెట్ ధరతో కొనవచ్చు. రూ.405 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గాపెట్టుకోవాలి.
జిందాల్ స్టీల్: చివరి రెండు నెలల్లో ఈ షేరు 14 శాతం వరకు రాబడిని అందించింది. ప్రస్తుతం స్వల్ప పుల్‌బ్యాక్ కనిపిస్తోంది. 200 రోజుల మూవింగ్ యావరేజీ వద్ద మద్దతు దొరికే వీలుంది. గత శుక్రవారం రూ.1,165 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.1,150 శ్రేణిలో ప్రవేశించి రూ.1,280 టార్గెట్ ధరతో కొనవచ్చు. రూ.1,120 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.