టెక్ వ్యూ నిరోధ స్థాయిలకు చేరువలో..
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:19 AM
నిఫ్టీ గత వారం ఆరంభంలో ర్యాలీని కొనసాగిస్తూ చివరకు 656 పాయింట్ల (2.6ు) లాభంతో 25,800 వద్ద క్లోజైంది. తొలుత రియాక్షన్‌ను కనబరిచినప్పటికీ ప్రధాన స్థాయిలైన...
నిఫ్టీ గత వారం ఆరంభంలో ర్యాలీని కొనసాగిస్తూ చివరకు 656 పాయింట్ల (2.6ు) లాభంతో 25,800 వద్ద క్లోజైంది. తొలుత రియాక్షన్‌ను కనబరిచినప్పటికీ ప్రధాన స్థాయిలైన 25,000 ఎగువన రికవరీ సాధించి వరుసగా నాలుగో వారం కూడా లాభాల్లోనే ముగిసింది. నిఫ్టీ కనిష్ఠ స్థాయిల నుంచి ఎలాంటి కరెక్షన్ లేదా కన్సాలిడేషన్ లేకుండా దాదాపు 3,600 పాయింట్లు ర్యాలీని కనబరచింది. ప్రస్తుతం నిఫ్టీ ఇటీవలి గరిష్ఠ స్థాయిలైన 26,000కు చేరువలో ఉంది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో ఏర్పడిన స్థాయి. ఇక్కడ రియాక్షన్‌కు అవకాశాలున్నాయి. కొద్ది రోజులు ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకుంటేనే పటిష్ఠతను సూచిస్తుందా లేదా అనేది తేలుతుంది. అయితే గరిష్ఠ స్థాయిల వద్ద మదుపరులు అప్రమత్తంగా ఉండటం మంచిది. కాగా గత వారం మిడ్‌క్యాప్ ఇండెక్స్ తొలుత 2 శాతం మేర పతనమైనప్పటికీ చివరకు స్వల్ప లాభాలతో ఎలాంటి మార్పు లేకుండా 62,000 వద్ద క్లోజైంది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ మాత్రం 1 శాతం పతనమై 19,440 వద్ద ముగిసింది.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ సానుకూల ట్రెండ్‌ను కనబరిస్తే 25,920 ఎగువన నిరోధ స్థాయిలుంటాయి. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధం 26,000. తదుపరి దిశను తీసుకునే ముందు ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. స్వల్పకాలిక సానుకూలత కోసం ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోవాలి.
బేరిష్ స్థాయిలు: నిఫ్టీ మరింత బలహీనతను సూచిస్తే 25,500 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. ఇది గత వారం నిరోధ స్థాయి. సానుకూల సంకేతాల కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. ఒకవేళ నిలదొక్కుకోలేకపోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ 6 శాతం రికార్డు ర్యాలీతో 64,635 వద్ద క్లోజైంది. ఇది ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి. ఈ సూచీ అప్‌సైడ్ బ్రేకౌట్‌ను సాధించిన నాటి నుంచి ఎలాంటి పుల్ బ్యాక్ రియాక్షన్‌ను కనబరచలేదు. ప్రస్తుతం అలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈ వారం సానుకూల ట్రెండ్‌ను కనబరిస్తే తదుపరి నిరోధ స్థాయి 65,000. ఇది సరికొత్త ధరల స్థాయి, మానసిక అవధి స్థాయి. సానుకూలత కోసం ఈ స్థాయిలకు ఎగువన నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బలహీనతను సూచిస్తే 64,000 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి.
పాటర్న్: నిఫ్టీ ప్రస్తుతం ఓవర్‌బాట్ పొజిషన్‌ను కొనసాగిస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఐ సూచిస్తోంది. అప్రమత్తంగా వ్యవహరించాలి. 26,000 వద్ద అడ్డంగా దిగువకు ఏర్పడిన నిరోధ ట్రెండ్‌లైన్ వద్ద తదుపరి నిరోధం ఉంది. అలాగే 25,500 వద్ద అడ్డంగా కిందకు ఏర్పడిన ట్రెండ్ వద్ద మద్దతు స్థాయిలున్నాయి. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం బుధవారం రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 25,920, 26,000
మద్దతు : 25,580, 25,500
వి. సుందర్ రాజా
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్