మార్కెట్ మరింత పతనం!!
ABN , Publish Date - Mar 04 , 2026 | 01:23 AM
పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కన్పించడం లేదు. రోజురోజుకూ త్రీవరూపం దాలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధం కనీసం 4-5 వారాలు కొనసాగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా...
నిఫ్టీ 22,000 దిగువకు జారనుందా..?
పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కన్పించడం లేదు. రోజురోజుకూ త్రీవరూపం దాలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధం కనీసం 4-5 వారాలు కొనసాగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధి ద్వారా చమురుతో పాటు ఇతర ఉత్పత్తుల రవాణా ఇప్పటికే స్తంభించిపోయింది. దాంతో ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. మంగళవారం ఒక దశలో 85 డాలర్లకు ఎగబాకింది. త్వరలోనే 100 డాలర్లు దాటవచ్చన్న అంచనాలున్నాయి. క్రూడ్ షాక్‌తో భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు మరింత పతనం కానున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఎన్‌ఎ్‌సఈ ప్రామాణిక సూచీ నిఫ్టీ-50 మున్ముందు సెషన్లలో మరో 10-12 శాతం క్షీణించే అవకాశాలున్నాయని వారు భావిస్తున్నారు. అంటే, సూచీ 22,000 దిగువకు (21,800 స్థాయికి) పడిపోయే అవకాశం ఉంది.
నేడు సూచీలు క్రాష్!: హోలీ సందర్భంగా మంగళవారం భారత స్టాక్ ఎక్స్ఛేంజీలు సెలవు పాటించినప్పటికీ అమెరికా, యూరప్, ఆసియా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. మన అంతర్జాతీయ ఈక్విటీ ఇండెక్స్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక దశ లో 830 పాయింట్లు క్షీణించింది. గిఫ్ట్ నిఫ్టీ ట్రెండ్‌ను బట్టి చూస్తే, బుధవారం సెన్సెక్స్, నిఫ్టీ మరో భారీ పతనాన్ని నమోదు చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
5 లక్షల కోట్ల డాలర్ల దిగువకు మార్కెట్ సంపద
సోమవారం బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.6.59 లక్షల కోట్లు తగ్గి రూ.456.90 లక్షల కోట్లకు (4.99 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. బీఎ్‌సఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 లక్షల కోట్ల డాలర్ల దిగువకు జారుకోవడం గత ఏడాది మే 9 తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. మార్కెట్ సంపద ఆల్‌టైం గరిష్ఠ స్థాయి నుంచి 13 శాతం క్షీణించగా.. ఈ ఏడాదిలో ఇప్పటికే 5.6 శాతం తగ్గింది. దాంతో ప్రపంచ మార్కెట్ క్యాప్‌లో భారత్ వాటా 3.17 శాతానికి పడిపోయింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్
ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి