Share News

అమ్మకానికి 17 జాతీయ రహదారులు

ABN , Publish Date - May 29 , 2026 | 04:26 AM

తెలంగాణతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో తన నిర్వహణలోని 1,692.5 కిలోమీటర్ల పొడవైన 17 జాతీయ రహదారి ప్రాజెక్టుల నుంచి...

అమ్మకానికి 17 జాతీయ రహదారులు

జాబితాలో యాదగిరి-వరంగల్‌ సెక్షన్‌లో రెండు ప్యాకేజీలు: ఎన్‌హెచ్‌ఏఐ

న్యూఢిల్లీ: తెలంగాణతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో తన నిర్వహణలోని 1,692.5 కిలోమీటర్ల పొడవైన 17 జాతీయ రహదారి ప్రాజెక్టుల నుంచి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ ఆర్థిక సంవత్సరం తప్పుకోనుంది. ఈ ప్రాజెక్టుల ఈక్విటీలో తన పెట్టుబడులను టోల్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌ (టీఓటీ), ఇన్విట్స్‌ ద్వారా వెనక్కి తీసుకోనున్నట్టు తెలిపింది. ఇందులో తెలంగాణలోని యాదగిరి-వరంగల్‌ మధ్య ఉన్న 99.1 కిలోమీటర్ల పొడవైన రెండు రహదారి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ప్యాకేజీ-1లో కోమల్ల సెక్షన్‌లో 54 కిలోమీటర్ల నుంచి 122.9 కిలోమీటర్ల వరకు, ప్యాకేజీ-2లో కోమటిపల్లి సెక్షన్‌లో 122.9 కిలోమీటర్ల నుంచి 153.103 కిలోమీటర్ల వరకు గల రహదారిని ఎన్‌హెచ్‌ఏఐ విక్రయించనుంది.

ఇవి కూడా చదవండి..

అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే.

Updated Date - May 29 , 2026 | 11:18 AM