Share News

వస్త్ర రంగం ప్రోత్సాహకానికి కొత్త పథకం: కేంద్ర ఆర్థిక మంత్రి

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:53 AM

దేశంలో కొత్తగా మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ పథకంలో భాగంగా ఖాదీ, హ్యాండ్లూమ్ రంగాలను బలోపేతం చేస్తామన్నారు.

వస్త్ర రంగం ప్రోత్సాహకానికి కొత్త పథకం: కేంద్ర ఆర్థిక మంత్రి

  • టైక్స్‌టైల్‌ రంగం కోసం 5 సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమం

  • వచ్చే ఐదేళ్లలో రూ.10వేల కోట్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 01: దేశంలో కొత్తగా మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. మహాత్మాగాంధీ గ్రామ్ స్వరాజ్ పథకంలో భాగంగా ఖాదీ, హ్యాండ్లూమ్ రంగాలను బలోపేతం చేస్తామన్నారు. అలాగే 200 పారిశ్రామిక క్లస్టర్ల ఆధునీకరణకు చేయూత అందిస్తామని ఆమె తెలిపారు. ఇక నాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీకి ప్రత్యేక పథకాన్ని రూపొందించామన్నారు. కంటైనర్ నిర్మాణ రంగానికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆదివారం పార్లమెంట్‌లో ఆమె ప్రవేశపెట్టారు.

Updated Date - Feb 01 , 2026 | 12:21 PM