మారుతి సుజుకీ సరికొత్త బాలెనో
ABN , Publish Date - Sep 06 , 2026 | 05:15 AM
మారుతి సుజుకీ ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త వెర్షన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో కారును విడుదల చేసింది....
ప్రారంభ ధర రూ.6.09 లక్షలు
మారుతి సుజుకీ ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త వెర్షన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో కారును విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.09 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో లెవల్ 2 ఏడీఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)తో తీసుకువచ్చిన తొలి కారు ఇది. అడ్వాన్స్‌డ్ జెడ్12ఈ పవర్‌ట్రెయిన్ ఇంజన్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, హిల్ హోల్డ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. కొత్త బాలెనో కారులో ఉన్నాయని మారుతి సుజుకీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
మల్కాజిగిరి నియోజకవర్గంలో 48,505 మందికి ‘సర్’ నోటీసులు
సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగిస్తాయని ఆశిస్తున్నాం: ఏపీ ఎన్జీవో చీఫ్ విద్యాసాగర్