Share News

నియామకాలకు కొత్త కార్మిక చట్టాల దన్ను

ABN , Publish Date - Feb 09 , 2026 | 05:20 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలతో దేశంలోని చిన్న చిన్న నగరాల్లో ఉద్యోగ నియామకాలు జోరందుకున్నాయి. గత ఏడాది నవంబరు 21 నుంచి ఈ చట్టాలు అమల్లోకి వచ్చాయి. దీంతో అప్పటి నుంచి...

నియామకాలకు కొత్త కార్మిక చట్టాల దన్ను

  • చిన్న నగరాల్లో మరింత జోరుగా కొలువులు

  • విజయవాడలో 20% పెరిగిన నియామకాలు

  • వర్క్‌ఇండియా

ముంబై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలతో దేశంలోని చిన్న చిన్న నగరాల్లో ఉద్యోగ నియామకాలు జోరందుకున్నాయి. గత ఏడాది నవంబరు 21 నుంచి ఈ చట్టాలు అమల్లోకి వచ్చాయి. దీంతో అప్పటి నుంచి జాబ్‌ పోస్టింగ్‌లు 8.4ు పెరిగినట్టు కంపెనీలకు నియామక సేవలు అందించే ‘వర్క్‌ఇండియా’ అనే సంస్థ ఒక నివేదికలో తెలిపింది. తృతీయ, నాలుగో స్థాయి నగరాల్లో ఈ జోరు మరింత ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం నాలుగు కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొల్హాపూర్‌లో జాబ్‌ పోస్టింగ్‌లు అత్యధికంగా 56.3%, ఉదయ్‌పూర్‌లో 55.3%, గోవాలో 23.6% చొప్పున పెరిగాయి.

ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జాబ్స్‌ మార్కెట్‌పైనా కనిపిస్తోందని వర్క్‌ఇండియా నివేదిక తెలిపింది. గత ఏడాది నవంబరు 21 నుంచి ఇప్పటి వరకు విజయవాడ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జాబ్‌ పోస్టింగ్‌లు 20.2ు పెరిగాయి. కోచి (17.7%), కోయంబత్తూర్‌ (14.1%), రాయ్‌పూర్‌ (13.9%) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

మొత్తం మీద ఈ చిన్న నగరాల్లో జాబ్‌ పోస్టింగ్‌లు సగటున 12 నుంచి 15% చొప్పున పెరగుతున్నాయి. దీంతో కొత్త కార్మిక చట్టాలతో సెమీ అర్బన్‌ ప్రాంతాల్లోని సంఘటిత రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నట్టు అర్థమవుతోందని వర్క్‌ఇండియా తెలిపింది.

ఇవి కూడా చదవండి

షేర్వానీ వేసుకో.. రూబీ టోపీ పెట్టుకో

బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత రమేశ్‌ చంద్ర పోలీసు కస్టడీలో మృతి

Updated Date - Feb 09 , 2026 | 05:20 AM