Share News

ఎన్‌సీసీకి రూ.1,077 కోట్ల ఆర్డర్‌

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:03 AM

ఎన్‌సీసీ లిమిటెడ్‌.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రూ.1,076.71 కోట్ల విలువైన ఆర్డర్‌ను చేజిక్కించుకుం ది. విశాఖపట్నం గ్రామీణ నీటి సరఫరా...

ఎన్‌సీసీకి రూ.1,077 కోట్ల ఆర్డర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎన్‌సీసీ లిమిటెడ్‌.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి రూ.1,076.71 కోట్ల విలువైన ఆర్డర్‌ను చేజిక్కించుకుం ది. విశాఖపట్నం గ్రామీణ నీటి సరఫరా, శానిటేషన్‌ శాఖ నుంచి ఈ కాంట్రాక్టును అందుకున్నట్లు తెలిపింది. ఆర్డర్‌లో భాగంగా అనకాపల్లి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్‌ నుంచి మల్టీ విలేజ్‌ పథకం కింద మంచి నీటి సరఫరా ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంటుందని పేర్కొంది. 24 నెలల్లో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉంటుందని ఎన్‌సీసీ తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌..

Updated Date - Sep 29 , 2026 | 05:03 AM