ఎన్‌సీసీ ఆదాయం రూ.6,042 కోట్లు
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:28 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌సీసీ లిమిటెడ్.. కన్సాలిడేటెడ్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌సీసీ లిమిటెడ్.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.6,041.68 కోట్ల టర్నోవర్‌పై రూ.184.29 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.154.70 కోట్లుగా ఉండగా టర్నోవర్ రూ.4,585.06 కోట్లుగా ఉంది. కాగా స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన కంపెనీ రూ.163.17 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే కాలంలో ఆదాయం రూ.4,956.71 కోట్లుగా ఉన్నట్లు ఎన్‌సీసీ వెల్లడించింది. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ కొత్తగా రూ.4,838 కోట్ల ఆర్డర్లను చేజిక్కించుకోవటంతో మొత్తం ఆర్డర్ బుక్ రూ.80,167 కోట్లకు చేరుకుంది.
ఈ వార్తలూ చదవండి
ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విట్ యూనివర్సిటీ రూ.కోటి విరాళం..
ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు పోలిం