Share News

తగ్గిన ఎన్‌సీసీ లాభం

ABN , Publish Date - May 16 , 2026 | 03:19 AM

ఎన్‌సీసీ లిమిటెడ్‌.. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన...

తగ్గిన ఎన్‌సీసీ లాభం

ఒక్కో షేరుకు 110% డివిడెండ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎన్‌సీసీ లిమిటెడ్‌.. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.6,250.98 కోట్ల టర్నోవర్‌పై రూ.206.02 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలం లో టర్నోవర్‌ రూ.6,189.36 కోట్లుగా ఉండగా లాభం రూ.253.82 కోట్లుగా ఉంది. స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.5,382.19 కోట్ల ఆదాయంపై రూ.202.88 కోట్ల లాభా న్ని ఆర్జించింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ.20,944.40 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.675.32 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

కాగా రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.2.20 డివిడెండ్‌ (110%)ను డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రూ.31,884 కోట్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకోవటంతో మొత్తం ఆర్డర్‌ బుక్‌ రూ.83,004 కోట్లకు చేరుకుందని ఎన్‌సీసీ వెల్లడించింది.

ఈ వార్తలనూ చదవండి:

కేంద్రం కీలక నిర్ణయం.. పసిడి దిగుమతిపై పరిమితి

42 నెలల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం

Updated Date - May 16 , 2026 | 03:19 AM