Share News

నవ లిమిటెడ్‌ లాభంలో 55 శాతం క్షీణత

ABN , Publish Date - May 16 , 2026 | 03:16 AM

గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో నవ లిమిటెడ్‌.. రూ.1,194.80 కోట్ల కన్సాలిడేటెడ్‌...

నవ లిమిటెడ్‌ లాభంలో 55 శాతం క్షీణత

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో నవ లిమిటెడ్‌.. రూ.1,194.80 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.136.30 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 13.2 శాతం (రూ.1,055.80 కోట్లు) వృద్ధి చెందగా లాభం 55 శాతం (రూ.302.80 కోట్లు) క్షీణించింది. స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన మాత్రం రూ.614.30 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.478.10 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 16.3 శాతం, లాభం ఏకంగా 392.3 శాతం వృద్ధి చెందింది. పటిష్ఠమైన నిర్వహణా సామర్థ్యం, డివిడెండ్‌, షేర్‌ బైబ్యాక్‌ ద్వారా నగదు రావటంతో స్టాండ్‌ఎలోన్‌ ఆదాయం, లాభం గణనీయంగా పెరిగిందని నవ లిమిటెడ్‌ పేర్కొంది. కాగా రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.5.50 (550ు) తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.

ఈ వార్తలనూ చదవండి:

కేంద్రం కీలక నిర్ణయం.. పసిడి దిగుమతిపై పరిమితి

42 నెలల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం

Updated Date - May 16 , 2026 | 03:16 AM