ఉద్యోగ నియామకాలు కొనసాగుతాయ్..
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:35 AM
ఈ ఏడాది ద్వితీయార్ధంలో నియామకాలు (కొత్త, రీప్లే్‌సమెంట్) కొనసాగుతాయని మానవ వనరుల (హెచ్‌ఆర్) విభాగ అధిపతులు అంచనా వేస్తున్నారని ..
నౌకరీ హైరింగ్ ఔట్‌లుక్
ముంబై: ఈ ఏడాది ద్వితీయార్ధంలో నియామకాలు (కొత్త, రీప్లే్‌సమెంట్) కొనసాగుతాయని మానవ వనరుల (హెచ్‌ఆర్) విభాగ అధిపతులు అంచనా వేస్తున్నారని నౌకరీ హెచ్2 2026 హైరింగ్ ఔట్‌లుక్ నివేదిక పేర్కొంది. ఆరు నెలలకు ఒకసారి వెలువడే ఈ నివేదికను వివిధ రంగాలకు చెందిన 540 మందికి పైగా సీనియర్ హెచ్‌ఆర్ లీడర్లు, నియామక నిర్ణయాలు తీసుకునే వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించారు. సర్వేలో పాల్గొన్న హెచ్‌ఆర్ లీడర్లలో దాదాపు 97% మంది ఈ ఏడాది ద్వితీయార్ధంలో నియామకాలు కొనసాగుతాయని ఆశించగా.. 79% మంది కొత్త ఉద్యోగాల కల్పన ఉంటుందని అంచనా వేసినట్టు నివేదిక పేర్కొంది. బిజినెస్ డెవల్‌పమెంట్ (45%), మార్కెటింగ్ (37%), ఐటీ (31%) విభాగాల్లో అత్యధిక నియామకాలుంటాయని అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!