Share News

నాట్కో లాభం రూ.151 కోట్లు

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:35 AM

డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో నాట్కో ఫార్మా ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 14 శాతం వృద్ధితో రూ.151 కోట్లకు పెరిగింది. 2024-25..

నాట్కో లాభం రూ.151 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో నాట్కో ఫార్మా ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 14 శాతం వృద్ధితో రూ.151 కోట్లకు పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి సంస్థ లాభం రూ.132 కోట్లుగా నమోదైంది. ఈ క్యూ3లో కంపెనీ ఆదాయం రూ.647 కోట్లకు ఎగబాకింది. గత క్యూ3లో రూ.475 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను నాట్కో ఒక్కో షేరుకు రూ.1.50 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీ చైర్మన్‌, ఎండీగా వెంకయ్య చౌదరి నన్నపనేని పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఏప్రిల్‌ 1 నుంచి ఈ నియామకం అమలులోకి రానుంది. అలాగే, 3 లక్షల డాలర్ల (సుమారు రూ.2.7 కోట్లు) పెట్టుబడితో చిలీలో అనుబంధ సంస్థ ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది.

ఇవి కూడా చదవండి..

చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 13 , 2026 | 03:35 AM