Share News

అమెరికా మార్కెట్లోకి నాట్కో క్యాన్సర్‌ ఔషధం

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:17 AM

అమెరికా మార్కెట్లోకి పొమాలిడొమైడ్‌ జెనరిక్‌ క్యాప్సూల్స్‌ను విడుదల చేసినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది....

అమెరికా మార్కెట్లోకి నాట్కో క్యాన్సర్‌ ఔషధం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికా మార్కెట్లోకి పొమాలిడొమైడ్‌ జెనరిక్‌ క్యాప్సూల్స్‌ను విడుదల చేసినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. బ్రెకెన్‌రిడ్జ్‌ ఫార్మాస్యూటికల్‌ భాగస్వామ్యంతో ఈ ఔషధాన్ని విడుదల చేసినట్లు తెలిపింది. బ్లడ్‌, బోన్‌ మ్యారో క్యాన్సర్‌ చికిత్సలో పెద్దలకు ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు. కాల్జినీ కంపెనీ ఉత్పత్తి పోమాలి్‌స్టకు ఇది జెనరిక్‌ వెర్షన్‌. 1, 2, 3, 4 ఎంజీ డోసేజీ ల్లో ఈ ఔషధాన్ని స్పెషాలిటీ ఫార్మసీలు, క్లినిక్‌లలో అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

Updated Date - Mar 04 , 2026 | 01:17 AM