Share News

ప్రత్యేక కంపెనీగా ఆగ్రో కెమికల్స్‌ వ్యాపారం

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:50 AM

నాట్కో ఫార్మా రెండు కంపెనీలుగా మారనుంది. కంపెనీకి చెందిన ఆగ్రో కెమికల్స్‌ వ్యాపారాన్ని నాట్కో క్రాప్‌ హెల్త్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీహెచ్‌ఎ్‌సఎల్‌) పేరుతో ప్రత్యేక...

ప్రత్యేక కంపెనీగా ఆగ్రో కెమికల్స్‌ వ్యాపారం

వాటాదారులకు 1:1 నిష్పత్తిలో షేర్లు: నాట్కో ఫార్మా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నాట్కో ఫార్మా రెండు కంపెనీలుగా మారనుంది. కంపెనీకి చెందిన ఆగ్రో కెమికల్స్‌ వ్యాపారాన్ని నాట్కో క్రాప్‌ హెల్త్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీహెచ్‌ఎ్‌సఎల్‌) పేరుతో ప్రత్యేక అనుబంధ కంపెనీగా విభజించేందుకు నాట్కో ఫార్మా డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ విభజన ద్వారా నాట్కో ఫార్మాలో వాటాలు ఉన్న ప్రతి వాటాదారుకు కొత్త కంపెనీలో 1:1 నిష్పత్తిలో షేర్లు జారీ చేసేందుకూ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి ఈ విభజన అమల్లోకి వస్తుందని నాట్కో ఫార్మా తెలిపింది. అయితే ఈ విభజన కంపెనీ వాటాదారులు, రుణదాతలు, ఎన్‌సీఎల్‌టీ తుది ఆమోదానికి లోబడి ఉంటుందని పేర్కొంది. ఈ ఆమోదాలన్నీ లభించాక కొత్త కంపెనీ షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదుకు దరఖాస్తు చేస్తారు. ఈ విభజన తర్వాత కొత్త కంపెనీ ఈక్విటీలో నాట్కో ఫార్మాకు 20ు, నాట్కో మదుపరులకు 80ువాటా ఉంటుంది.

నైజీరియాలో ప్రత్యేక కంపెనీ: నైజీరియాలో నాట్కో ఫార్మా నైజీరియా లిమిటెడ్‌ ప్రత్యేక అనుబంధ కంపెనీ నమోదుకు కూడా నాట్కో ఫార్మా డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. అయితే ఈ ప్రత్యేక అనుబంధ కంపెనీ ప్రారంభ పెట్టుబడులు లక్ష డాలర్ల లోపే ఉండాలని స్పష్టం చేసింది. ఇదే సమావేశంలో ఆస్ట్రేలియాలోని ప్రత్యేక అనుబంధ కంపెనీ నాట్కో ఫార్మా ఆస్ట్రేలియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రద్దుకూ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరుకల్లా ఈ కంపెనీ మూసివేత పూర్తవుతుందని నాట్కో ఫార్మా భావిస్తోంది.

ఇవీ చదవండి:

యుద్ధంతో ఇంధన సంక్షోభం, భారత్‌పైనా ఆ ప్రబావం ఉంది: మోదీ

క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Updated Date - Mar 25 , 2026 | 05:50 AM