ఐటీ కంపెనీలు జర జాగ్రత్త
ABN , Publish Date - Mar 10 , 2026 | 02:04 AM
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఇన్మర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆ రంగానికి ప్రాతినిఽధ్యం వహించే నాస్కామ్ కోరింది...
సైబర్ దాడుల ముప్పు పొంచి ఉంది: నాస్కామ్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఇన్మర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆ రంగానికి ప్రాతినిఽధ్యం వహించే నాస్కామ్ కోరింది. లేకపోతే సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టడంతో పాటు ఒకవేళ సైబర్ దాడులు జరిగినా వెంటనే మీ కార్యకలాపాలను పునరుద్ధరించి కొనసాగించేందుకు సిద్ధమై ఉండాలని కోరింది. యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతున్నందున సైబర్ దాడుల ముప్పూ పెరుగుతోందని హెచ్చరించింది. ప్రస్తుతానికైతే భారత ఐటీ కంపెనీల కార్యకలాపాలు స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది. ఒకవేళ ఏదైనా అనుకోని ఉపద్రవం ఏర్పడినా పరిస్థితులను వెంటనే సరిదిద్దుకునే వ్యవస్థలను ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకోవడమే గాక వాటిని ఎప్పటికపుడు సమీక్షించుకుంటున్నట్టు నాస్కామ్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ
పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్