Share News

నాస్కామ్‌ ఛైర్మన్‌గా శ్రీకాంత్‌ వెలమకన్ని

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:21 AM

భారత ఐటీ రంగ అత్యున్నత పర్యవేక్షణ సంస్థ నాస్కామ్‌ కొత్త ఛైర్మన్‌గా ప్రముఖ ఏఐ సంస్థ ఫ్రాక్టల్‌ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈఓ శ్రీకాంత్‌ వెలమకన్ని...

నాస్కామ్‌  ఛైర్మన్‌గా శ్రీకాంత్‌ వెలమకన్ని

న్యూఢిల్లీ: భారత ఐటీ రంగ అత్యున్నత పర్యవేక్షణ సంస్థ నాస్కామ్‌ కొత్త ఛైర్మన్‌గా ప్రముఖ ఏఐ సంస్థ ఫ్రాక్టల్‌ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈఓ శ్రీకాంత్‌ వెలమకన్ని నియమితులయ్యారు. శాప్‌ ల్యాబ్స్‌ ఇండియా ఏండీ సింధూ గంగాధరన్‌ పదవీ కాలం ముగియడంతో ఆమె స్థానంలో శ్రీకాంత్‌ ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. కేపీఐటీ సీఈఓ, ఏండీ కిషోర్‌ పాటిల్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నికైనట్లు నాస్కామ్‌ తెలిపింది. నాస్కామ్‌ వైస్‌ ఛైర్మన్‌గా, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఆరేళ్లకు పైగా అనుభవం కలిగిన శ్రీకాంత్‌.. ఈ కొత్త బాధ్యతలో పరిశ్రమకు మరింత సమర్థ నాయకత్వం అందిస్తారంటున్నారు. అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా భారత్‌ను మేటీ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు, మరీ ముఖ్యంగా ఏజెంటిక్‌ ఏఐ, ప్రొడక్ట్‌ ఇన్నోవేషన్‌ అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు శ్రీకాంత్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి..

శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్

నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి

Updated Date - Apr 24 , 2026 | 05:21 AM