ఏఐతో భారత ఐటీకి కాసుల పంట!
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:35 AM
సంప్రదాయ ఐటీ కంపెనీల సేవలను కృత్రిమ మేధ (ఏఐ) భర్తీ చేయవచ్చన్న ఆందోళనలను పరిశ్రమ నిపుణులు తోసిపుచ్చారు. భవిష్యత్‌లో భారత ఐటీ రంగానికి ఏఐ భారీగా ఆదాయం సమకూరనుందని న్యూయార్క్‌లో...
2030 నాటికి రూ.38 లక్షల కోట్ల మేర అవకాశాలు: నాస్కామ్
న్యూఢిల్లీ: సంప్రదాయ ఐటీ కంపెనీల సేవలను కృత్రిమ మేధ (ఏఐ) భర్తీ చేయవచ్చన్న ఆందోళనలను పరిశ్రమ నిపుణులు తోసిపుచ్చారు. భవిష్యత్‌లో భారత ఐటీ రంగానికి ఏఐ భారీగా ఆదాయం సమకూరనుందని న్యూయార్క్‌లో జరిగిన నాస్కామ్ యూఎస్ సీఈఓ ఫోరమ్‌లో వారన్నారు. ఏఐ యుగంలో కంపెనీల డిజిటల్ పరివర్తనానికి ఐటీ రంగం కీలకమని వారు పేర్కొన్నారు. దేశీయ ఐటీ కంపెనీలు ఏఐ సేవల ద్వారా ఇప్పటికే 1,000-1,200 కోట్ల డాలర్ల (రూ.95,000 -1,14,000 కోట్లు) మేర ఆదాయాన్ని గడిస్తున్నాయని, దాదాపు 25 శాతం కంపెనీల ఏఐ ప్రయోగాలు ఉత్పత్తి దశకు చేరుకున్నాయని ఇండస్ట్రీ అసోసియేషన్ నాస్కామ్ తెలిపింది. ఈ అసోసియేషన్ ఇంకా ఏమన్నదంటే..
ఏఐ ఉత్పాదకత ప్రయోజనాలను అందించడంతో పాటు ప్రామాణిక, పునరావృత పనులను కుదిస్తుంది. అలాగే, సాంకేతిక సమన్వయం, డేటా సంసిద్ధత, అప్లికేషన్ మోడ్రనైజేషన్, ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏజెంట్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఇండస్ట్రీ ఆధారిత పరిష్కారాలకు గిరాకీని విస్తరింపజేయనుంది.
ఇప్పటికే 20 లక్షలకు పైగా ఐటీ ఇంజనీర్లు ఏఐలో నైపుణ్యం కలిగి ఉన్నారు. 1-2 లక్షల మంది అడ్వాన్స్‌డ్ ఏఐలో శిక్షణ తీసుకున్నారు. దాదాపు 85 శాతం టెక్నాలజీ సేవల కంపెనీలు ఏజెంటిక్ ఏఐ ప్లాట్‌ఫామ్స్‌ను కలిగి ఉన్నాయి. ఏజెంటిక్ ఏఐ సేవలు ఐటీ కంపెనీలకు 2030 నాటికి 30,000 -40,000 కోట్ల డాలర్ల (రూ.28.50-38 లక్షల కోట్లు) ఆదాయ అవకాశాలను సృష్టించే అవకాశాలున్నాయి.
ఐటీ రంగ విస్తరణలోనూ సమూల మార్పులు జరగనున్నాయి. భవిష్యత్ వృద్ధి సిబ్బంది పెంపుపై తక్కువగా.. ప్లాట్‌ఫామ్స్, డొమైన్ సొల్యూషన్స్, ప్రొప్రైటరీ అసెట్స్, అవుట్‌కమ్ ఆధారిత డెలివరీపై అధికంగా ఆధారపడనుంది. బిజినెస్ ప్రాసెస్ సేవలు ప్రస్తుత లావాదేవీల ఎగ్జిక్యూషన్ నుంచి ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్‌కు మారనున్నాయి. సిబ్బంది కేవలం పర్యవేక్షణ, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అనలిటిక్స్, డిసిషన్ సపోర్ట్‌కు మాత్రం పరిమితం కానున్నారు.
ఇవి కూడా చదవండి
విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..
IND vs IRE: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..