Share News

ఫార్మా రంగ పారితోషికాల్లో మురళి దివి టాప్‌

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:42 AM

హైదరాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ దివీస్‌ లేబొరేటరీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) మురళి కే దివి గత ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను మొత్తం రూ.100.26 కోట్ల పారితోషికం అందుకున్నారు...

ఫార్మా రంగ పారితోషికాల్లో మురళి దివి టాప్‌

2025-26కి రూ.100 కోట్లు అందుకున్న దివీస్‌ ల్యాబ్‌ ఎండీ

ముంబై: హైదరాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ దివీస్‌ లేబొరేటరీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) మురళి కే దివి గత ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను మొత్తం రూ.100.26 కోట్ల పారితోషికం అందుకున్నారు. తద్వారా దేశీయ లిస్టెడ్‌ ఫార్మా కంపెనీల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు. అంతేకాదు, దివి తర్వాత రెండో స్థానంలో ఉన్న సిప్లా మాజీ ఎండీ, గ్లోబల్‌ సీఈఓ ఉమంగ్‌ వోహ్రాకు లభించిన రూ.45.73 కోట్ల వార్షిక ప్యాకేజీతో పోలిస్తే రెట్టింపు కంటే అధికం. కాగా, జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ ఎండీ శర్విల్‌ పటేల్‌ (రూ.45 కోట్లు), టొరెంట్‌ ఫార్మా ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ (రూ.36 కోట్లు), లుపిన్‌ సీఈఓ వినితా గుప్తా (రూ.26.69 కోట్లు) వరుసగా 3, 4, 5వ స్థానాల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి...

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ.

Updated Date - Jul 21 , 2026 | 05:42 AM