గ్లోబల్ ఏఐ కమిషన్‌లో అంబానీ, మిట్టల్
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:40 AM
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఎయిర్‌టెల్ అధిపతి సునీల్ మిట్టల్‌కు అరుదైన గౌరవం దక్కింది. కొత్తగా ప్రారంభమైన ‘ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్’లో వ్యవస్థాపక సభ్యులుగా...
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఎయిర్‌టెల్ అధిపతి సునీల్ మిట్టల్‌కు అరుదైన గౌరవం దక్కింది. కొత్తగా ప్రారంభమైన ‘ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్’లో వ్యవస్థాపక సభ్యులుగా వీరిద్దరూ నియమితులయ్యారు. బాధ్యతాయుతమైన కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) మద్దతుతో ఏర్పాటైన ఈ కమిషన్‌లో మొత్తం 44 మంది సభ్యులుంటారు. రువాండా అధ్యక్షులు పాల్ కగామే, సేల్స్‌ఫోర్స్ చైర్మన్, సీఈఓ మార్క్ బెనియో్‌ఫలు ఈ ప్యానెల్‌కు సహ-చైర్మన్‌లుగా వ్యవహరించనుండగా.. ఐటీయూ సెక్రటరీ జనరల్ డొరీన్ బోగ్డాన్ మార్టిన్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. స్టీల్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్, అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ, ఎన్‌విడియా వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సెన్ హువాంగ్, మైక్రోసాఫ్ట్ వైస్‌చైర్మన్ బ్రాడ్ స్మిత్, గూగుల్ ప్రతినిధి జేమ్స్ మనైకా, క్వాల్‌కామ్ సీఈఓ క్రిస్టియానో అమన్, ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకులు జాక్ క్లార్క్, యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ వంటి టెక్నాలజీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్ ప్రారంభ సమావేశం ఈ నెల 7-10 తేదీల్లో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగపూర్-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్ కేబుల్
For More Business News And Telugu News