Share News

ఎంఎస్ఎంఈలపై ‘యుద్ధ’ భారం

ABN , Publish Date - May 29 , 2026 | 04:29 AM

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎంఎస్ఎంఈ)పై పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపై పారిశ్రామిక మండళ్ల సమాఖ్య అసోచామ్‌ ఆందోళన...

ఎంఎస్ఎంఈలపై ‘యుద్ధ’ భారం

రాష్ట్ర ప్రభుత్వాలూ ఆదుకోవాలి.. అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ సౌరభ్‌ సన్యాల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎంఎస్ఎంఈ)పై పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపై పారిశ్రామిక మండళ్ల సమాఖ్య అసోచామ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యుద్ధ ప్రభావంతో ఈ కంపెనీలు ఆర్థికంగా చితికిపోతున్నాయని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ సౌరబ్‌ సన్యాల్‌ చెప్పారు. ఈ సంస్థలను ఆదుకునేందుకు రూ.2.55 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర పరపతి హామీ పథకం (ఈసీజీఎంఎస్)తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలూ ప్రత్యేక పథకాలతో ఆదుకోవాలని కోరారు. ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభంతో దేశంలోని దాదాపు 61 శాతం ఎంఎస్ఎంఈలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో అనేక ఎంఎస్ఎంఈల రుణాలు మొండి బకాయిలు (ఎన్‌పీఏ)గా మారే ప్రమాదం ఉందని సన్యాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు కనీసం ఆరు నెలల పాటు ఈ సంస్థల రుణ చెల్లింపులపై మారటోరియం విధించాలని ఆర్‌బీఐని కోరినట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి..

అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే.

Updated Date - May 29 , 2026 | 04:29 AM