Share News

విస్తరణ బాటలో మోటోహౌస్‌

ABN , Publish Date - May 13 , 2026 | 02:05 AM

ప్రీమియం యూరోపియన్‌ మొబిలిటీ బ్రాండ్స్‌ అయిన బ్రిక్స్‌టన్‌ మోటార్‌సైకిల్స్‌, వీఎల్‌ఎఫ్‌ స్కూటర్లను విస్తరిస్తున్న మోటోహౌస్‌...

విస్తరణ బాటలో మోటోహౌస్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రీమియం యూరోపియన్‌ మొబిలిటీ బ్రాండ్స్‌ అయిన బ్రిక్స్‌టన్‌ మోటార్‌సైకిల్స్‌, వీఎల్‌ఎఫ్‌ స్కూటర్లను విస్తరిస్తున్న మోటోహౌస్‌.. హైదరాబాద్‌లో తొలి షోరూమ్‌ను ప్రారంభించింది. కంపెనీకి ఇది దేశంలో 14 షోరూమ్‌ అని సంస్థ తుషార్‌ షెల్కే తెలిపారు. విస్తరణలో భాగంగా ఈ ఏడాది కొత్తగా 16 షోరూమ్‌లను ప్రారంభించనుండగా అందులో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఏపీలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో రెండు నుంచి మూడు షోరూమ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. బ్రిక్స్‌టన్‌ మోటార్‌సైకిల్స్‌ బ్రాండ్స్‌.. క్రాస్‌ఫైర్‌ 500ఎక్స్‌, 500 ఎక్స్‌సీతో పాటు వీఎల్‌ఎఫ్‌ స్కూటర్స్‌ బ్రాండ్‌.. మోబ్‌స్టర్‌ 135 సహా ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వీఎల్‌ఎఫ్‌ టెన్నిస్‌ మోడళ్లను కంపెనీ విక్రయిస్తోందన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత

Updated Date - May 13 , 2026 | 02:05 AM