డిసెంబరు కల్లా సెన్సెక్స్ 1.07 లక్షలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:29 AM
ఈ ఏడాది డిసెంబరు చివరికల్లా సెన్సెక్స్ 1.07 లక్షల పాయింట్లకు చేరుకుంటుందని అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ప్రస్తుత స్థాయితో పోలిస్తే...
న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబరు చివరికల్లా సెన్సెక్స్ 1.07 లక్షల పాయింట్లకు చేరుకుంటుందని అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ప్రస్తుత స్థాయితో పోలిస్తే ఇది దాదాపు 25ు అదనం. ఏడు శాతానికి పైగా ఉన్న జీడీపీ వృద్ధిరేటు, వాల్యుయేషన్ల మెరుగు దల ఇందుకు దోహదం చేస్తాయని తెలిపింది. ఈ సంవత్సరం ఫైనాన్సియల్, వినియోగ వస్తువుల కంపెనీల షేర్లు బాగా రాణించే అవకాశం ఉందని పేర్కొంది. వడ్డీరేట్లు, సీఆర్‌ఆర్ కోత, నిధుల లభ్యత, జీఎ్‌సటీ రూపంలో దాదాపు రూ.1.5 లక్షల కోట్ల భారం తగ్గడం కంపెనీల అమ్మకాలతో పాటు లాభాలనూ పెంచుతాయని అంచనా వేసింది.
మూడో రోజూ మార్కెట్‌కు నష్టాలే
స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 102.20 పాయింట్ల నష్టంతో 84,961.14 వద్ద, నిఫ్టీ 37.95 పాయింట్ల నష్టంతో 26,140.75 వద్ద ముగిశాయి. భారత-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి, ఎఫ్‌పీఐ అమ్మకాలు సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి. అయితే బ్యారెల్ ముడి చమురు ధర 60.21 డాల ర్లకు రావడం, బ్లూచిప్ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు సూచీ లను ఇంట్రా డే కనిష్ఠ స్థాయిల నుంచి బయటపడేశాయి. డిసెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాలు రాబోయే బడ్జెట్ వరకు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..