2026-27లో వృద్ధి 6.4 శాతం : మూడీస్
ABN , Publish Date - Feb 10 , 2026 | 02:53 AM
ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.4ు వృద్ధిని సాధిస్తుందని, జీ-20 దేశాల్లో అమిత వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా...
న్యూఢిల్లీ: ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.4% వృద్ధిని సాధిస్తుందని, జీ-20 దేశాల్లో అమిత వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని రేటింగ్ సంస్థ మూడీస్ అంచనా వేసింది. దేశీయ వినియోగం బలం గా ఉండడంతో పాటు విధానపరమైన చర్య లు, సుస్థిరమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఇందుకు సహాయకారిగా ఉంటాయని తెలిపింది. ఎంఎ్‌సఎంఈ విభాగంలో స్వల్ప ఒత్తిడి ఉన్నప్పటికీ దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఆస్తుల నాణ్యత మెరుగ్గా ఉంటుందని పేర్కొంది. రుణాలపరంగా ఎలాంటి నష్టాలు ఏర్పడినా తట్టుకుని నిలిచేందుకు అవసరమైన నిల్వలు బ్యాంకుల వద్ద ఉన్నట్టు తెలిపింది. వ్యవస్థాత్మక సంస్కరణల కారణంగా 2026 లో బ్యాంకుల నిర్వహణాపరమైన వాతావరణం బలంగానే ఉంటుందని కూడా అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి..
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. భారత్ నిధులందిస్తోందంటూ పాక్ మంత్రి ఆరోపణలు..
లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..