15 శాతం పెరగనున్న మొబైల్ టారిఫ్‌లు!
ABN , Publish Date - Jun 09 , 2026 | 02:42 AM
దేశంలో మొబైల్ టెలిఫోన్ చార్జీలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వడ్డింపు 15 శాతం వరకు ఉండే అవకాశం ఉందని...
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ టెలిఫోన్ చార్జీలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వడ్డింపు 15 శాతం వరకు ఉండే అవకాశం ఉందని దేశీయ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబరు) నుంచే కంపెనీలు ఈ పెంపు అమలు చేసే అవకాశం ఉందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) టెలికాం కంపెనీల ఆదాయ వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు పడిపోవడమే ఇందుకు సంకేతమని పేర్కొంది. ఈ పెంపుతో గత ఆర్థిక సంవత్సరం రూ.2.7 లక్షల కోట్లుగా ఉన్న టెలికాం కంపెనీల ఆదాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రూ.3 లక్షల కోట్లకు చేరుతాయని అంచనా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు
16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల
Read AP News Latest, Telangana News And National News