Share News

విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌

ABN , Publish Date - May 09 , 2026 | 05:01 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌..ఆర్‌ఐఎన్‌ఎల్‌)కు చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా...

విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌..ఆర్‌ఐఎన్‌ఎల్‌)కు చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా ఎంఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన ఎన్‌ఎండీసీలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా పనిచేస్తున్నారు. 2028 ఏప్రిల్‌ 30 వరకు ఈయన ఆర్‌ఐఎన్‌ఎల్‌ సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రభాకర్‌.. తిరుపతిలో బీటెక్‌ (మెటలర్జీ) పూర్తి చేశారు. ఎన్‌ఎండీసీలో ఈడీగా బాధ్యతలు చేపట్టేంత వరకు సెయిల్‌కు చెందిన రూర్కేలా స్టీల్‌ ప్లాంట్‌లో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌కు ఇప్పటి వరకు ఇద్దరు తెలుగు వారు శివసాగర రావు, మధుసూధన్‌.. సీఎండీలు పని చేయగా తాజాగా ప్రభాకర్‌ ఆ జాబితాలోకి చేరారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఏఐతో ‘సాంప్రదాయ ఐటీ’కి భంగం

దేశంలో తొలి స్పేస్‌ టెక్‌ యూనికార్న్‌గా స్కైరూట్‌

Updated Date - May 09 , 2026 | 05:01 AM