Share News

ఎంఎంటీసీ పాంప్ లో మళ్లీ డిజిటల్‌ పసిడి విక్రయాలు షురూ

ABN , Publish Date - May 08 , 2026 | 01:50 AM

డిజిటల్‌ రూపంలో బంగారం, వెండి విక్రయాలను ఎంఎంటీసీ-పాంప్‌ పునఃప్రారంభించింది....

ఎంఎంటీసీ పాంప్ లో మళ్లీ డిజిటల్‌ పసిడి విక్రయాలు షురూ

న్యూఢిల్లీ: డిజిటల్‌ రూపంలో బంగారం, వెండి విక్రయాలను ఎంఎంటీసీ-పాంప్‌ పునఃప్రారంభించింది. తన వెబ్‌సైట్‌, ఆండ్రాయిడ్‌ యాప్‌ ద్వారా వినియోగదారులు నేరుగా వీటిని కొనుగోళ్లు చేయవచ్చని పేర్కొంది. గూగుల్‌పే, పేటీఎం, ఫోన్‌పే ద్వారా కూడా కొనుగోళ్లు జరపవచ్చని తెలిపింది. కనీసం రూ.10తో బంగారం, వెండిలో కస్టమర్లు పెట్టుబడి పెట్టవచ్చని పేర్కొంది. కస్టమర్లు కొనుగోలు చేసే మొత్తానికి సమానమైన లోహాన్ని భౌతిక రూపంలో సంస్థ సురక్షితంగా నిల్వ చేస్తుంది. రియల్‌ టైమ్‌ మార్కెట్‌ ధరలతో వినియోగదారులు క్రయవిక్రయాలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి..

భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Updated Date - May 08 , 2026 | 01:50 AM