వెండి నాణేలు, నగలకూ బైబ్యాక్ సేవలు ఎంఎంటీసీ పాంప్
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:04 AM
బులియన్ రిఫైనర్ ఎంఎంటీసీ-పాంప్ మరో సర్వీస్ ప్రారంభించింది. ప్రజల వద్ద ఉన్న వెండి నాణేలు, కడ్డీలు, నగలను బైబ్యాక్ చేస్తామని...
న్యూఢిల్లీ: బులియన్ రిఫైనర్ ఎంఎంటీసీ-పాంప్ మరో సర్వీస్ ప్రారంభించింది. ప్రజల వద్ద ఉన్న వెండి నాణేలు, కడ్డీలు, నగలను బైబ్యాక్ చేస్తామని ప్రకటించింది. సంఘటిత రంగంలోని ఒక బులియన్ రిఫైనరీ ఇలాంటి సర్వీసు ప్రారంభించడం దేశంలో ఇదే మొదటిసారి. ముందుగా కోల్‌కతా, భువనేశ్వర్, గువహతి, లూథియానా, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీల్లోని ఎంఎంటీసీ-పాంప్ నిర్వహణలో ఉన్న ఎంపిక చేసిన 17 ప్రత్యేక స్టోర్లలో ఈ సౌకర్యం లభిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఈ సేవను దేశంలోని అన్ని నగరాలకు విస్తరిస్తామని కంపెనీ ఎండీ, సీఈఓ సమిత్ గుహ చెప్పారు. ఖాతాదారులు తీసుకువచ్చిన వెండి నాణేలు, కడ్డీలు, నగలను కరిగించి తమ ప్యూరిటీ వెరిఫికేషన్ కేంద్రాల్లో పరీక్షించి ఆ రోజు మార్కెట్ ధర ప్రకారం వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తామన్నారు. దేశీయ వెండి ఉత్పత్తి- డిమాండ్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ పథకం కొంత వరకు సరిదిద్దే అవకాశం ఉందని ఎంఎంటీసీ-పాంప్ బులియన్ రిఫైనరీ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..
ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..