Share News

స్మార్ట్‌ఫోన్‌ విభాగంలోకి మివీ

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:17 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న టెక్నాలజీ బ్రాండ్‌ మివీ..స్మార్ట్‌ఫోన్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. క్వాల్‌కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌, గూగుల్‌...

స్మార్ట్‌ఫోన్‌ విభాగంలోకి మివీ

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న టెక్నాలజీ బ్రాండ్‌ మివీ..స్మార్ట్‌ఫోన్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. క్వాల్‌కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌, గూగుల్‌ భాగస్వామ్యంతో మివీ వన్‌ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది. స్నాప్‌డ్రాగన్‌ 5జీ చిప్‌సెట్‌తో రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 24న ఫ్లిప్‌కార్ట్‌ పోర్టల్‌పై ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్లు మివీ వెల్లడించింది. హైదరాబాద్‌లోని ప్లాంట్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను తయారు చేయనుంది. మివీ పోర్టుఫోలియోలో ఇప్పటికే ఇయర్‌బడ్స్‌, నెక్‌బాండ్స్‌, హెడ్‌ఫోన్స్‌, స్పీకర్స్‌, సౌండ్‌బార్స్‌ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మల్కాజిగిరి నియోజకవర్గంలో 48,505 మందికి ‘సర్‌’ నోటీసులు

సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగిస్తాయని ఆశిస్తున్నాం: ఏపీ ఎన్జీవో చీఫ్ విద్యాసాగర్

Updated Date - Sep 06 , 2026 | 05:17 AM