మివీ వన్ 5జీ స్మార్ట్‌ఫోన్
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:04 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ మివీ.. స్టార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టింది...
ప్రారంభ ధర రూ.11,999
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ మివీ.. స్టార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టింది. మివీ వన్ 5జీ పేరుతో స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. 128 జీబీ స్టోరేజీతో 4జీబీ, 6జీబీ, 8జీబీ వేరియంట్లతో వీటిని తీసుకువచ్చింది. స్నాప్‌డ్రాగన్ 4జెన్ 2 మొబైల్ ప్లాట్‌ఫామ్, 50 ఎంపీ డ్యూయల్ కెమెరా, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఈ ఫోన్ ప్రత్యేకతలు. అక్టోబరు 8 నుంచి ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్ ధరలు వరుసగా రూ.11,999, రూ.13,499, రూ.14,999గా ఉన్నాయి.
ఈ వార్తలనూ చదవండి
వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్