మిధానీ ఆదాయం రూ.553 కోట్లు
ABN , Publish Date - May 30 , 2026 | 02:23 AM
ప్రభుత్వ రంగంలోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధానీ).. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రభుత్వ రంగంలోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధానీ).. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.552.75 కోట్ల రెవెన్యూపై రూ.77.75 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభం 38.49 శాతం (రూ.56.14 కోట్లు) వృద్ధి చెందగా రెవెన్యూ 34.63 శాతం (రూ.410.56 కోట్లు) పెరిగింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.1.25 (12.5ు) తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
మరో రికార్డు దిశగా ఆంథ్రోపిక్! ట్రిలియన్ డాలర్లకు చేరువలో మార్కెట్ విలువ
తిరోగమనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు