Share News

మెర్సిడెస్‌ బెంజ్‌ హైబ్రిడ్‌ ఎస్‌-క్లాస్‌ ప్రారంభ ధర రూ.2.20 కోట్లు

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:58 AM

ప్రీమియం కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్‌ బెంజ్‌ మార్కెట్లోకి సరికొత్త ఎస్‌-క్లా్‌సను సోమవారం విడుదల చేసింది. ఇందులో తొలిసారిగా ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ (పీహెచ్‌ఈవీ)ను...

 మెర్సిడెస్‌ బెంజ్‌ హైబ్రిడ్‌ ఎస్‌-క్లాస్‌ ప్రారంభ ధర రూ.2.20 కోట్లు

ముంబై: ప్రీమియం కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్‌ బెంజ్‌ మార్కెట్లోకి సరికొత్త ఎస్‌-క్లా్‌సను సోమవారం విడుదల చేసింది. ఇందులో తొలిసారిగా ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ (పీహెచ్‌ఈవీ)ను తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.2.20 కోట్లు (ఎక్స్‌షోరూమ్‌, ఆల్‌ ఇండియా)గా ఉంది. కొత్త ఎస్‌-క్లాస్‌ బుకింగ్‌లను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. ఈ ఏడాది డిసెంబరు త్రైమాసికం నుంచి డెలివరీలను ప్రారంభించనుంది. ఎస్‌-క్లా్‌సలోని ఎస్‌ 450ఈ పీహెచ్‌ఈవీ 320 కిలోవాట్‌ (435 హెచ్‌పీ), 680 ఎన్‌ఎం కంబైన్డ్‌ ఔట్‌పుట్‌ను అందిస్తుందని, దీని ప్యూర్‌ ఎలక్ర్టిక్‌ రేంజ్‌ దాదాపు 115 కిలోమీటర్లని కంపెనీ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

ఐదు కంపెనీలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం..

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన ప్రధాని మోదీ..

Updated Date - Jun 16 , 2026 | 01:58 AM