Share News

మూడేళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Jul 04 , 2026 | 05:04 AM

మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) గ్రూప్‌ పెద్దఎత్తున వ్యాపార విస్తరణకు సిద్ధమవుతోంది. ఇందుకోసం...

మూడేళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు

  • ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల టర్నోవర్‌

  • రెండేళ్లకో గ్రూప్‌ కంపెనీ ఐపీఓ

  • మరో రెండు ఒలెకా్ట్ర ప్లాంట్లు

  • ఎంఈఐఎల్‌ ఎండీ పీవీ కృష్ణా రెడ్డి

హైదరాబాద్‌: మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) గ్రూప్‌ పెద్దఎత్తున వ్యాపార విస్తరణకు సిద్ధమవుతోంది. ఇందుకోసం వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో రూ.30,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. దీంతో గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.60,000 కోట్లుగా ఉన్న గ్రూప్‌ వార్షిక టర్నోవర్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.80,000 కోట్లకు, వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరుతుందని ఎంఈఐఎల్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీవీ కృష్ణా రెడ్డి చెప్పారు. ప్రస్తుతం తమ గ్రూప్‌ మొత్తం టర్నోవర్‌లో దాదాపు 60 శాతం ఎంఈఐఎల్‌ ద్వారానే వస్తున్నట్టు తెలిపారు. ఎంఈఐఎల్‌ గ్రూప్‌ నిర్వహణలోని గ్రీన్‌ఎనర్జీ, ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీ), ఇతర వ్యాపారాలూ క్రమంగా పుంజుకుంటున్నట్టు చెప్పారు.

వరుసగా పబ్లిక్‌ ఇష్యూలు..

ఇప్పటి వరకు అన్‌లిస్టెడ్‌ కంపెనీగా ఉన్న ఎంఈఐఎల్‌ గ్రూప్‌.. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)లకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇక రెండోళ్లకో అనుబంధ కంపెనీ ఐపీఓకు వస్తుందని కృష్ణా రెడ్డి చెప్పారు. ఇందులో ముందుగా ఈవే ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. పబ్లిక్‌ ఇష్యూకి వచ్చే అవకాశం ఉందన్నారు. తర్వాత డిఫెన్స్‌, గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ వంటి కంపెనీలు వరుసపెట్టి పబ్లిక్‌ ఇష్యూలు జారీ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఈవే ట్రాన్స్‌ ఒక్కటే పూర్తి స్థాయి ఈవీ బస్సులను నడుపుతోంది. కంపెనీ ఈ బస్సులను ముంబై, పుణె, సూరత్‌, సిల్వాస, గోవా, హైదరాబాద్‌, డెహ్రాడూన్‌ నగరాల్లో నడుపుతోంది.


విస్తరణ బాటలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌

సెల్స్‌, బ్యాటరీల తయారీ, ఫిజికల్‌ ఇంటలిజెన్స్‌ వంటి వినూత్న టెక్నాలజీలు, వ్యాపార అవకాశాలపై ఎంఈఐఎల్‌ ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు కృష్ణా రెడ్డి చెప్పారు. ఈవీ బస్సుల తయారీలో ఉన్న గ్రూప్‌ కంపెనీ ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తోందని ఆయన వెల్లడించారు. అయితే ఈ రెండు కొత్త ప్లాంట్లను ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 10,000 ఈవీ బస్సులుగా ఉంది. ఈ ప్లాంటులో ఏటా 4,000 ఈవీ బస్సులు మాత్రమే తయారవుతున్నాయి. వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టీసీ)ల నుంచి 8,000 నుంచి 10,000 ఈవీ బస్సులకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్టు కృష్ణా రెడ్డి చెప్పారు.

సంక్షిప్తంగా..

  • వ్యవసాయ సస్యరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ బీఏఎస్ఎఫ్‌.. రెండు క్రాప్‌ ప్రొటెక్షన్‌ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మైలారా, ఇన్వెరిస్‌ పేరుతో ఈ ఉత్పత్తులను విడుదల చేసింది. మైలారా.. పత్తి, వేరుశనగ, సోయాబీన్‌ పంటలను చీడ పీడల నుంచి కాపాడనుండగా ఇన్వెరిస్‌ కూరగాయల పంటలు కీటకాల బారిన పడకుండా రక్షిస్తుందని తెలిపింది.

  • మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) డిస్ట్రిబ్యూటర్స్‌కు డిజిటల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలందిస్తున్న అసెట్‌ప్లస్‌.. హర్‌ ఘర్‌ ఎంఎ్‌ఫడీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎంఎఫ్‌ డిస్ట్రిబ్యూటర్లు.. వృత్తిపరంగా మరిన్ని అవకాశాలను దక్కించుకోవటంతో పాటు అవసరమైన నైపుణ్యాలను పెంచుకునేందుకు తోడ్పాటునందించనుంది.

  • భారత్‌లోని క్రెడిట్‌ కార్డ్‌ యూజర్లకు.. పీబీ పాస్‌ పేరుతో కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్‌ లాంజ యాక్సె్‌సను ప్రారంభించినట్లు పైసాబజార్‌ వెల్లడించింది. ఇందుకోసం కోలిన్‌సన్‌ ఇంటర్నేషనల్‌తో జట్టు కట్టినట్లు ప్రకటించింది. పైసాబజార్‌ యాప్‌ ద్వారా క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్లించిన వారికి ఈ పాస్‌ను ఆఫర్‌ చేస్తున్నటు తెలిపింది.


  • ఏఐ+స్మార్ట్‌ఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్‌ జీఓఏటీ సేల్‌ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా ఏఐ+ పల్స్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,999, ఏఐ+ నోవా 2 ఫోన్‌ను రూ.10,999కి అందించనుంది. అలాగే మిగతా స్మార్ట్‌ఫోన్లు, వాచీలు, వేర్‌బడ్స్‌, నోవాపాడ్స్‌ సహా పలు ఉత్పత్తులకు ప్రత్యేక ధరలతో అందిస్తున్నట్లు వెల్లడించింది.

  • హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (హెచ్‌జెడ్‌ఎల్‌).. వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 11 లక్షల టన్నుల నుంచి 20 లక్షల టన్నులకు పెంచేందుకు రూ.40,000-50,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. అలాగే క్రిటికల్‌, రేర్‌ మినరల్స్‌ రంగాల్లోకి కార్యకలాపాలను విస్తరించటంపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది.

  • ఈ నెల 4 నుంచి 6 వరకు అందుబాటులో ఉండనున్న అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో యెజ్డీ స్ర్కాంబ్లర్‌ మోటార్‌సైకిల్‌ను విడుదల చేస్తున్నట్లు జావా యెజ్డీ ప్రకటించింది. అమెజాన్‌ కొత్త లాంచ్‌ స్టోర్‌లో ఈ బైక్‌ అందుబాటులో ఉంటుంది. సేల్‌లో భాగంగా ప్రత్యేక ఆఫర్లను అందించనుంది. ఈ బైక్‌ ధర రూ.1,99,950 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌).

  • విమానాల నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌ఓ) కోసం దేశంలో మరో యూనిట్‌ రానుంది. టాటాల నిర్వహణలోని ఎయిర్‌ ఇండియా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ అనుబంధ సంస్థ ఎస్‌ఐఏ ఇంజనీరింగ్‌ శుక్రవారం ఇందుకోసం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

జోరుగా పెట్టుబడుల ఉపసంహరణ

సింగపూర్‌-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్‌ కేబుల్‌

For More Business News And Telugu News

Updated Date - Jul 04 , 2026 | 05:05 AM