ఎంఈఐఎల్ నుంచి జీఈ వెర్నోవాకు ఆర్డర్
ABN , Publish Date - May 05 , 2026 | 05:14 AM
ఆంధ్రప్రదేశ్‌లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) నిర్మించే 1.35 గిగావాట్ల అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) నిర్మించే 1.35 గిగావాట్ల అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ జలవిద్యుత్ ప్లాంట్ కోసం ఒక్కోటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొమ్మిది పంప్డ్ స్టోరేజ్ యూనిట్లను సరఫరా చేసే భారీ ఆర్డరును దక్కించుకున్నట్టు అమెరికాకు చెందిన జీఈ వెర్నోవా సోమవారం వెల్లడించింది. ఈ ప్రాజెక్టు 2030 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. 1.35 గిగావాట్ల అప్పర్ సీలేరు ప్రాజెక్టు దేశంలోని అతిపెద్ద పంప్డ్ స్టోరేజ్ జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలువనుందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
బెంగాల్‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ