మారుతి కార్లు మరింత ప్రియం
ABN , Publish Date - Jul 22 , 2026 | 02:21 AM
కార్ల మార్కెట్ లీడర్ మారుతి సుజుకీ ఇండియా తన కార్ల ధరలను మరోసారి పెంచేందుకు సిద్ధమైంది. వచ్చే ఆగస్టు నుంచి అన్ని మోడళ్ల ధరలను...
రూ.30వేల వరకు ధరల పెంపు
ఆగస్టు నుంచి అమలులోకి..
న్యూఢిల్లీ: కార్ల మార్కెట్ లీడర్ మారుతి సుజుకీ ఇండియా తన కార్ల ధరలను మరోసారి పెంచేందుకు సిద్ధమైంది. వచ్చే ఆగస్టు నుంచి అన్ని మోడళ్ల ధరలను పెంచనున్నట్టు మంగళవారం కంపెనీ ప్రకటించింది. ధరల పెంపు రూ.30,000 వరకు ఉంటుందని తెలిపింది. ముడిసరుకుల వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు కంపెనీ పేర్కొంది. ధరల పెంపుదల మోడల్‌ను బట్టి మారుతుందని తెలిపింది. ద్రవ్యోల్బణం ఒత్తిడి అధికంగా ఉండటంతోపాటు వ్యయ పరిస్థితులు ప్రతికూలంగా కొనసాగడంతో పెరిగిన ఖర్చుల్లో కొంత భాగాన్ని కస్టమర్లకు బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొన్నట్టు తెలిపింది. మారుతి ఇంతకుముందు జూన్‌లో కార్ల ధరలను పెంచింది. ఇప్పుడు మళ్లీ పెంచనున్నట్టు ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ అధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!