9 లక్షల సీఎన్‌జీ కార్ల విక్రయ లక్ష్యం
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:17 AM
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐఎల్).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో 9 లక్షల సీఎన్‌జీ వాహనాలను విక్రయించాలని...
మారుతి సుజుకీ
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐఎల్).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో 9 లక్షల సీఎన్‌జీ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 7 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం అధికం. పశ్చిమాసియా సంక్షోభం అనంతరం ఇంధన ధరలు పెరగడంతో వినియోగదారులు తక్కువ నిర్వహణ వ్యయం కలిగిన ఈ సీఎన్‌జీ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారని, ఈ నేపథ్యంలో భారీగా విక్రయాలను చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మారుతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇప్పటికే వివిధ మోడళ్లతో కలిపి మొత్తం 2.2 లక్షల సీఎన్‌జీ వాహనాలను విక్రయించామని, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 58 శాతం అధికమని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం
అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు