Share News

మారుతి సుజుకీ పెండింగ్‌ బుకింగ్స్‌..

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:12 AM

పండగ సీజన్‌కు ముందే మారుతి సుజుకీ ఇండియా కార్లకు భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నెల 1 నాటికి కంపెనీ పెండింగ్‌ బుకింగ్స్‌...

మారుతి సుజుకీ పెండింగ్‌ బుకింగ్స్‌..

2 లక్షల యూనిట్లు

న్యూఢిల్లీ: పండగ సీజన్‌కు ముందే మారుతి సుజుకీ ఇండియా కార్లకు భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నెల 1 నాటికి కంపెనీ పెండింగ్‌ బుకింగ్స్‌ 2 లక్షల యూనిట్లను దాటినట్లు మారుతి వెల్లడించింది. ఇందులో కొత్తగా ప్రవేశపెట్టిన బ్రెజ్జా కాంపాక్ట్‌ ఎస్‌యూవీల ఆర్డర్లే 95,000 లకు పైగా ఉన్నట్లు తెలిపింది. ఈ భారీ డిమాండ్‌ను తట్టుకునేందుకు హరియాణాలోని ఖర్కోడా ప్లాంట్‌లో బ్రెజ్జా కార్ల నెలవారీ ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాన్ని 50,000 యూనిట్ల నుంచి 56,000 యూనిట్లకు పెంచినట్లు వెల్లడించింది. బ్రెజ్జా మోడల్‌ మొత్తం బుకింగ్స్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ వాటా 40ుఉండగా..1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ వేరియంట్‌ వాటా 38 శాతంగా ఉంది.

ఈ వార్తలూ చదవండి

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ ఏడు మోసాల పట్ల జాగ్రత్త వహించండి..

క్రిప్టోపై ఇప్పటికీ అప్రమత్తంగానే ఉన్నాం: ఆర్బీఐ గవర్నర్

Updated Date - Oct 04 , 2026 | 05:12 AM