Share News

కార్ల కంపెనీల జోరు

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:02 AM

కార్ల కంపెనీల అమ్మకాల్లో జోరు మే నెలలోనూ కొనసాగింది. మారుతి సుజుకీ, కియా ఇండియాలు రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేశాయి. మారుతి సుజుకీ అత్యధిక నెలవారీ అమ్మకాలను...

కార్ల కంపెనీల జోరు

మే నెలలో మారుతి, కియా రికార్డు స్థాయి అమ్మకాలు

న్యూఢిల్లీ: కార్ల కంపెనీల అమ్మకాల్లో జోరు మే నెలలోనూ కొనసాగింది. మారుతి సుజుకీ, కియా ఇండియాలు రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేశాయి. మారుతి సుజుకీ అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసినట్టు ప్రకటించింది. కంపెనీ మొత్తం అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 34.76 శాతం పెరిగి 2,42,688 యూనిట్లకు చేరాయి. దేశీయ అమ్మకాలు కూడా ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయిలో 1,93,535 యూనిట్లుగా నమోదయ్యాయి. కియా ఇండియా టోకు విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 23.6 శాతం వృద్ధి చెంది 27,586 యూనిట్లకు చేరాయి. కంపెనీకివే అత్యధిక మే నెల అమ్మకాలు. హ్యుండయ్‌ మోటార్‌ దేశీయ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 9.1శాతం వృద్ధి చెంది 47,837 యూనిట్లుగా నమోదయ్యాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా మొత్తం వాహనాల అమ్మకాలు (ఎగుమతులు సహా) వార్షిక ప్రాతిపదికన 20 శాతం వృద్ధి చెంది 99,636 యూనిట్లకు చేరాయి. టాటా మోటార్స్‌ ప్యాసెంజర్‌ వెహికిల్స్‌ మొత్తం విక్రయాలు గత ఏడాది మే నెలతో (42,040 యూనిట్లు) పోల్చితే 42 శాతం పెరిగి 59,790 యూనిట్లకు చేరుకున్నాయి. టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ మొత్తం అమ్మకాలు 33,128 యూనిట్లుగా ఉన్నాయి.

టూవీలర్లూ రయ్‌ రయ్‌: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా మే నెలలో మొత్తంగా 5.18 లక్షల వాహనాలను విక్రయించింది. బజాజ్‌ ఆటో మొత్తం వాహన అమ్మకాలు (ఎగుమతులు సహా) మే నెలలో వార్షిక ప్రాతిపదికన 20 శాతంవృద్ధి చెంది 4,61,257 యూనిట్లకు చేరాయి. టీవీఎస్‌ మోటార్‌ అమ్మకాలు 31 శాతం పెరిగి 5,66,585 యూనిట్లుగా నమోదయ్యాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మేలో 1,03,231 యూనిట్లను విక్రయించింది. సుజుకీ మోటార్‌సైకిల్‌ మొత్తం అమ్మకాలు గతేడాది మే నెలతో (1,28,897 యూనిట్లు) పోల్చితే 3 శాతం పెరిగి 1,32,244 యూనిట్లకు చేరాయి.

ఇవి కూడా చదవండి...

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం

Updated Date - Jun 02 , 2026 | 05:02 AM