Share News

మార్కెట్లోకి మారుతి ఈ-విటారా

ABN , Publish Date - Feb 18 , 2026 | 02:14 AM

కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ మంగళవారం లాంఛనంగా ఈవీల రంగంలోకి అడుగు పెట్టింది. తొలి బ్యాటరీ విద్యుత్‌ కారు ఈ-విటారాను మార్కెట్లో ప్రవేశపెట్టింది...

మార్కెట్లోకి మారుతి ఈ-విటారా

ధర రూ.10.99 లక్షలు

న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ మంగళవారం లాంఛనంగా ఈవీల రంగంలోకి అడుగు పెట్టింది. తొలి బ్యాటరీ విద్యుత్‌ కారు ఈ-విటారాను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో ఈ కారును విక్రయించాలని మారుతి లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ (బాస్‌) యాజమాన్య ప్రణాళికతో ప్రవేశపెట్టిన ఈ కారు ధర రూ.10.99 లక్షలు. ఈ కారు 61 కిలోవాట్లు, 49 కిలోవాట్ల సామర్థ్యంతో అందుబాటులో ఉంటుంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 543 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. ఈ కారు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ 7.4 కేడబ్ల్యూ ఏసీ సామర్థ్యం గల వాల్‌ బాక్స్‌ చార్జర్‌ ఇన్‌స్టలేషన్‌తో సహా కాంప్లిమెంటరీగా లభించనుంది. కొనుగోలుదార్లకు బాస్‌తో కూడిన ఫ్లెక్సిబుల్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్లు అందుబాటులో ఉంచుతున్నట్టు మారుతి తెలిపింది.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 18 , 2026 | 02:19 AM