మరోసారి మారుతి కార్ల ధరల పెంపు
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:16 AM
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. కార్ల ధరలను మరోసారి పెంచింది...
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. కార్ల ధరలను మరోసారి పెంచింది. రోజురోజుకు పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, ఉత్పత్తి వ్యయాల నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై సగటున 0.31 శాతం వరకు ధరలను పెంచినట్లు వెల్లడించింది. పెంచిన ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకునేందుకు చర్యలను తీసుకుంటున్నప్పటికీ ఖర్చుల భారం కొనసాగుతోందని, ఇందులో కొంత భాగాన్ని వినియోగదారులపై బదిలీ చేయక తప్పడం లేదని మారుతి సుజుకీ పేర్కొంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు దఫాల్లో కలిపి 1 శాతానికి పైగా ధరలను మారుతి సుజుకీ పెంచింది.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్