‘మారుతి 800’కు ప్రతిష్ఠాత్మక అవార్డు
ABN , Publish Date - Nov 17 , 2026 | 05:39 AM
దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతి సుజుకీ ఇండియాకు చెందిన బుల్లి కారు మారుతి 800కు ఫివా వరల్డ్ వెహికిల్ హెరిటేజ్ అవార్డు...
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతి సుజుకీ ఇండియాకు చెందిన బుల్లి కారు మారుతి 800కు ఫివా వరల్డ్ వెహికిల్ హెరిటేజ్ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకోబోతున్న తొలి, ఏకైక భారత కారు ఇదేనని మారుతి సుజుకీ సోమవారం వెల్లడించింది. అమెరికా, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్లొవేనియా సహా ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మకమైన, సాంస్కృతికంగా ముఖ్యమైన 21 వాహనాలను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
ఇవీ చదవండి
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!