Stock Market Open February 1: ఫిబ్రవరి 1న మార్కెట్లు పని చేస్తాయి
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:09 AM
ఫిబ్రవరి ఒకటో తేదీన ఆదివారం అయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజిలైన...
ముంబై: ఫిబ్రవరి ఒకటో తేదీన ఆదివారం అయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజిలైన ఎన్‌ఎ్‌సఈ, బీఎ్‌సఈ పని చేస్తాయి. ఈ మేరకు రెండు ఎక్స్ఛేంజిలు ఇన్వెస్టర్ల సమాచారం కోసం సర్కులర్లు జారీ చేశాయి. ఆ రోజు ప్రీ ఓపెన్ మార్కెట్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై 9.08కి ముగుస్తుందని, ఆ తర్వాత సాధారణ మార్కెట్ వేళలు 9.15 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ఉంటాయని ఎన్‌ఎ్‌సఈ తెలియచేసింది. బీఎ్‌సఈ కూడా అదే తరహా సర్కులర్ జారీ చేస్తూ సాధారణ వేళల్లోనే మార్కెట్ పని చేస్తుందని వెల్లడించింది.
ఇవీ చదవండి:
30 వాట్స్ లేదా 60 వాట్స్ చార్జర్.. బ్యాటరీ మన్నికకు ఏది బెటర్?
వైద్య కళాశాలల అవసరం భవిష్యత్తులో ఉండదు.. ఎలాన్ మస్క్ వ్యాఖ్య