మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు
ABN , Publish Date - Feb 28 , 2026 | 02:13 AM
అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో పాటు పెరిగిన భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా శుక్రవారం ఈక్విటీ మార్కెట్ భారీ కుదుపునకు లోనైంది. విదేశీ నిధుల తరలింపు...
సెన్సెక్స్ 961 పాయింట్లు డౌన్
ముంబై: అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో పాటు పెరిగిన భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా శుక్రవారం ఈక్విటీ మార్కెట్ భారీ కుదుపునకు లోనైంది. విదేశీ నిధుల తరలింపు మార్కెట్ నష్టాలకు ఆజ్యం పోసింది. ఫలితంగా బీఎ్‌సఈ సెన్సెక్స్ 961.42 పాయింట్లు నష్టపోయి 81,287.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 317.90 పాయింట్ల నష్టంతో 25,178.65 వద్ద ముగిసింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 1,527.52 పాయింట్లు, నిఫ్టీ 392.6 పాయింట్లు నష్టపోయాయి. మార్కెట్ కల్లోలంతో ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.4,98,603.42 కోట్లు నష్టపోయి రూ.4,63,50,671.27 వద్ద (5.10 లక్షల కోట్ల డాలర్లు) స్థిరపడింది.
పెరిగిన బంగారం ధర
ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి కొనుగోళ్ల మద్దతుతో ఢిల్లీ మార్కెట్లో మేలిమి బంగారం ధర 10 గ్రాములు రూ.1,800 పెరిగి రూ.1,64,700 పలికింది. కిలో వెండి ధర రూ.2,500 నష్టపోయి రూ.2.68 లక్షల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ విపణిలో స్పాట్ వెండి ధర ఔన్సు (31.10 గ్రాములు) 1.42 డాలర్లు పెరిగి 89.72 డాలర్ల వద్ద ముగియగా బంగారం ధర స్వల్పంగా దిగజారి 5,172.17 డాలర్లు పలికింది.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ