మార్చి 31 దగ్గర పడుతోంది
ABN , Publish Date - Mar 15 , 2026 | 05:43 AM
ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తోంది. ఇంకా 16 రోజులే సమయం ఉంది. పీపీఎఫ్, ఎన్‌ఎ్‌సపీ, సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ఉన్న వ్యక్తులు.. ఆ ఖాతాల్లో ప్రతి ఆర్థిక సంవత్సరం కనీసం ఇంత మొత్తమని డిపాజిట్ చేయాలి...
వీటిని వెంటనే పూర్తి చేయండి
ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తోంది. ఇంకా 16 రోజులే సమయం ఉంది. పీపీఎఫ్, ఎన్‌ఎ్‌సపీ, సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ఉన్న వ్యక్తులు.. ఆ ఖాతాల్లో ప్రతి ఆర్థిక సంవత్సరం కనీసం ఇంత మొత్తమని డిపాజిట్ చేయాలి. లేకపోతే ఆ ఖాతాలను స్తంభింప చేసే ప్రమాదం ఉంది. మళ్లీ వాటిని రీయాక్టివేట్ చేయించాలంటే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు కొన్ని పన్ను రాయితీలను కోల్పోవాల్సి రావచ్చు.
పీపీఎఫ్ ఖాతా: పీపీఎఫ్ ఖాతాల్లో ఏటా కనీసం రూ.500 అయినా డిపాజిట్ చేయాలి. లేకపోతే సంవత్సరానికి రూ.50 చొప్పున జరిమానా పడుతుంది. పీపీఎఫ్ ఖాతాను స్తంభింప చేస్తే దానిపై లోన్ తీసుకునేందుకు గానీ ఖాతాలోని మొత్తాన్ని వెనక్కి తీసుకునే అవకాశంగానీ ఉండవు.
ఎన్‌పీఎ్‌స: ఎన్‌పీఎ్‌స టియర్1 ఖాతా యాక్టివ్‌గా ఉండాలంటే ఏటా ఆ ఖాతాలో కనీసం రూ.1,000 అయినా డిపాజిట్ చేయాలి. లేకపోతే ఆ ఖాతాను స్తంభింప చేస్తారు. మళ్లీ ఆ ఖాతాను యాక్టివేట్ చేయించాలంటే రూ.100 పెనాల్టీగా చెల్లించాలి.
సుకన్య సమృద్ధి యోజన: బాలికల ఆర్థిక భవిష్యత్ కోసం ఈ పథకాన్ని ఉద్దేశించారు. ఈ పథకం ఖాతాలో ఏటా కనీసం రూ.250 అయినా డిపాజిట్ చేయాలి. లేకపోతే ఈ ఖాతాను స్తంభింప చేస్తారు. మళ్లీ అ ఆ ఖాతాను యాక్టివేట్ చేయించాలంటే రూ.50 పెనాల్టీగా చెల్లించాలి.
పన్ను ఆదా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా ప్రయోజనాలు పొందాలంటే.. పెట్టుబడులన్నీ ఈ నెలాఖరులోగానే పూర్తి చేయాలి. దీనికి తోడు సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద ఎన్‌పీఎ్‌సలో ఏటా రూ.50,000 వరకు పెట్టే పెట్టుబడులకూ పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఆలస్యం వద్దు: ఇంకా సమయం ఉంది కదాని ఆలస్యం చేస్తే, లాస్ట్ మినిట్‌లో రద్దీ పెరిగి పోతుం ది. సాంకేతిక అవాంతరాలూ ఎదురుకావచ్చు. వెంటనే మీ బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లండి. వెళ్లి ఈ పథకాల్లో కనీస వార్షిక పెట్టుబడులు వెంటనే పూర్తి చేయండి. దాని వల్ల మీ పీపీఎఫ్, ఎన్‌పీఎ్‌స లేదా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు యాక్టివ్‌గా ఉండడంతో పాటు పన్ను ప్రయోజనాలూ అందుకోవచ్చు.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే