ఏపీ, తెలంగాణపై మణిపాల్ హాస్పిటల్స్ కన్ను
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:11 AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో మరింతగా విస్తరించాలని మణిపాల్ హాస్పిటల్స్ భావిస్తోంది...
హాస్పిటల్స్ కొనుగోళ్లకూ సిద్ధమని వెల్లడి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో మరింతగా విస్తరించాలని మణిపాల్ హాస్పిటల్స్ భావిస్తోంది. ఇందుకోసం ఈ రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తన వార్షిక నివేదికలో తెలిపింది. హాస్పిటల్స్ విస్తరణతో పాటు ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్‌కేర్ మోడల్ తమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్నట్టు పేర్కొంది. అలాగే ఛత్తీ్‌సగఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఝార్ఖండ్, సిక్కిం రాష్ట్రాల్లోనూ హాస్పిటల్స్ కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు
ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!