హైదరాబాద్‌పై మణిపాల్ హెల్త్ నజర్
ABN , Publish Date - Jul 25 , 2026 | 02:08 AM
త్వరలో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వస్తున్న కార్పొరేట్ హాస్పిటళ్ల నిర్వహణ సంస్థ మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్.. హైదరాబాద్ మార్కెట్లోకి విస్తరించే ఆలోచనలో ఉంది. వ్యాపార విస్తరణ...
ఏదైనా ఆసుపత్రి కొనుగోలు ద్వారా ఎంట్రీ ఆలోచన
29 నుంచి ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి రూ.560-590
ముంబై: త్వరలో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వస్తున్న కార్పొరేట్ హాస్పిటళ్ల నిర్వహణ సంస్థ మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్.. హైదరాబాద్ మార్కెట్లోకి విస్తరించే ఆలోచనలో ఉంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌తో పాటు కేరళ, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఆసుపత్రుల కొనుగోళ్లు చేపట్టాలనుకుంటున్నట్లు మణిపాల్ హెల్త్ ఎండీ, సీఈఓ దిలీప్ జోస్ తెలిపారు. సొంత ఆసుపత్రుల విస్తరణ, కొనుగోళ్ల ద్వారా తమ బెడ్ల సామర్థ్యాన్ని వచ్చే మూడేళ్లలో మరో 3,000 మేర పెంచుకోవాలనుకుంటున్నట్లు, ఇందుకోసం రూ.3,560 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్ దిగ్గజం టెమాసెక్ పెట్టుబడులు కలిగిన మణిపాల్ హెల్త్ రూ.9,275 కోట్ల ఐపీఓ ఈ నెల 29న ప్రారంభమై 31న ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణిని కంపెనీ రూ.560-590గా నిర్ణయించింది. ఐపీఓలో భాగంగా రూ.8,000 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత వాటాదారులకు చెందిన 2.16 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) ద్వారా విక్రయించనుంది. తాజా ఈక్విటీ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.5,378 కోట్లను రుణాల తిరిగి చెల్లింపులకు ఉపయోగించుకోనున్నట్లు తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు