Share News

మహీంద్రా ‘వీరో’ సీఎన్‌జీ

ABN , Publish Date - Sep 09 , 2026 | 02:06 AM

చిన్న వాణిజ్య వాహనాల (ఎల్‌సీవీ) విభాగంలో తన పట్టును మరింత పెంచుకునేందుకు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) సరికొత్త ‘వీరో’ వేరియంట్లను మార్కెట్లోకి...

మహీంద్రా ‘వీరో’ సీఎన్‌జీ

న్యూఢిల్లీ: చిన్న వాణిజ్య వాహనాల (ఎల్‌సీవీ) విభాగంలో తన పట్టును మరింత పెంచుకునేందుకు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) సరికొత్త ‘వీరో’ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 1.1 టన్నుల సామర్థ్యంతో కూడిన ఎక్స్‌ఎక్స్‌ఎల్‌ సీఎన్‌జీ వీరోతో పాటు అప్‌గ్రేడ్‌ చేసిన డీజిల్‌ వేరియంట్లను కంపెనీ విడుదల చేసింది. సీఎన్‌జీ విభాగంలో వీ2 ప్రారంభ ధర రూ.8.25 లక్షలు, వీ4 ధర రూ.8.55 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది. డీజిల్‌ వేరియంట్ల ప్రారంభ ధరలు రూ.8.29 లక్షల నుంచి రూ.9.45 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉన్నాయి. కాగా త్వరలోనే వీరో ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మహీంద్రా వెల్లడించింది.

మహీంద్రా ఈవీ ప్రత్యేక వర్క్‌షాప్‌: భారత్‌లోనే తొలిసారిగా మహీంద్రా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) వర్క్‌షాప్‌ను హైదరాబాద్‌లో మహీంద్రా ప్రారంభించింది. ఆటోమోటివ్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (ఏఎంపీఎల్‌ గ్రూప్‌)తో కలిసి దీన్ని ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి:

గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్

Updated Date - Sep 09 , 2026 | 02:06 AM